WPL : రాయల్ చాలెంజర్స్ పై గుజరాత్ జెయింట్స్ విజయం

by | Feb 27, 2025 | వార్తలు

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో  గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది

మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది

33 పరుగులు చేసిన కనిక అహుజా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు టాప్ స్కోరర్.  టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తోన్న పెర్రీ ఈ మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యారు.  కెప్టెన్ స్మృతి మంధన 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు

గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో డాటిన్, కన్వర్ చెరో రెండు వికెట్లు తీశారు. గార్డనర్, గౌతమ్ చెరో ఒక వికెట్ తీశారు

అనంతరం 128 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్ కు సరైన శుభారంభం లభించలేదు. 

ఓపెనర్ హేమలత 11 పరుగులు చేసి అవుట్ అయ్యింది.  మరో ఓపెనర్ బెత్ మూనీ 17 పరుగులు చేసి అవుట్ అయ్యింది

హర్లీన్ డియోల్ 5 పరుగులకే అవుట్ అయినా, కెప్టెన్ గార్డనర్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరుగెత్తించింది.  గార్డనర్ కు లిచ్ ఫీల్డ్ చక్కని సహకారం అందించింది. ప్రేమ రావత్ వేసిన ఒక ఓవర్ లో గార్డనర్ విరుచుకుపడింది. ఆ ఓవర్ లో గార్డనర్ 3 ఫోరులు, ఒక సిక్స్ బాదింది. ఈ క్రమంలోనే గార్డనర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. గార్డనర్ అర్ధ సెంచరీ కి 28 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. అయితే 31 బంతుల్లో 58 పరుగులు చేసిన గార్డనర్ అర్ధ సెంచరీ చేసిన అదే ఓవర్లో వారెహామ్ బౌలింగ్ లో  అవుట్ అయ్యింది

అయితే గార్డనర్ అవుట్ అయ్యే సమయానికి గుజరాత్ జెయింట్స్ విజయానికి కావలసిన పరుగులు 9.  లిచ్ ఫీల్డ్ చివర వరకు ఉండి గుజరాత్ టైటాన్స్ ను గెలిపించారు.  లిచ్ ఫీల్డ్ 21 బంతుల్లో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. గుజరాత్ జెయింట్స్ 16.3 ఓవర్ల లోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది 

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ల లో రేణుక సింగ్, వారెహామ్ లు రెండేసి వికెట్లు తీశారు 58 పరుగులు చేయడమే కాకుండా కీలకమైన పెర్రీ వికెట్ తీసిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ గార్డనర్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది