విక్టరీ వెంకటేష్(Venkatesh) , ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి.
సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సినిమా వెంకటేష్, అనిల్ రావిపూడి (Anil Ravipudi) లకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అటు దిల్ రాజు కు ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ అయిన కూడా సినిమా ఇదే.
ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్ హక్కులను 35 కోట్లకు జీ నెట్ వర్క్ వారు దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా, ఓ టి టి లో కన్నా ముందుగా, టెలివిజన్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వస్తున్నట్లుగా జీ తెలుగు ప్రోమో వదిలారు. జీ 5 లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు
ప్రాంతీయ చిత్రాలలో 300 కోట్లవసూళ్లు సాధించిన చిత్రం గా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని జీ తెలుగు (Zee Telugu ) లో మార్చ్ 1 న ,సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయబోతున్నారు. జీ తెలుగు వారు దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు నేరుగా టెలివిజన్ లో బ్రాడ్ కాస్ట్ చేయడం ద్వారా రికార్డు స్థాయిలో రేటింగ్ ఆశిస్తున్నారు జీ తెలుగు వాళ్ళు.
అయితే జీ 5 (ZEE5) లో కూడా అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా జీ 5 యాప్ లో ప్రకటించారు. అంటే టెలివిజన్ లో, ఓ టి టి లో ఒకే రోజు, ఒకే సమయం లో ప్రీమియర్ చేయబోతున్నారన్నమాట.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ (World Television Premiere) ను ఆదివారం కాకుండా మార్చ్ 1, శనివారం నాడు జీ తెలుగు వారు ప్రసార చేయబోతున్నారు. ఎందుకంటె, స్టార్ మా వారు కౌంటర్ గా వేరే ప్రీమియర్ ఏమైనా వేస్తారేమో అని.

