‘ఆర్‌సీ16’ మూవీ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన శివన్న!

by | Feb 27, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ
పాన్ ఇండియా సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ (Sukumar) రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్‌ మ్యూజిక్ అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. అయితే, తాజాగా ‘ఆర్‌సీ16’ సినిమాకు సంబంధించి అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కన్నడ న‌టుడు శివరాజ్ కుమార్ (Shiv Raj Kumar)

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ‘ఆర్‌సీ16’ చిత్ర యూనిట్ ద‌గ్గ‌రినుంచి నాకు సందేశం వ‌చ్చింది. ఇది ఒక పాన్ఇండియా చిత్రంగా రూపొందుతోంది. మార్చి 5న హైదరాబాద్‌ వెళ్తున్నా. కొన్ని రోజుల పాటు ‘ఆర్‌సీ16’
సినిమా చిత్రీకరణలో పాల్గొంటాను. ఈ సినిమా నా పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది అంటూ శివరాజ్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా.. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్‌ (Ram Charan), దివ్యేందులపై క్రికెట్‌ బ్యాగ్డ్రాప్ సీన్స్ షూట్ చేశారు. ఇక ఈ మూవీ సెకండ్ షెడ్యూల్‌ మార్చి మొదటి వారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తో పాటు ఇతర ముఖ్య నటులపై కుస్తీ బ్యాగ్డ్రాప్ సీన్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. కాగా, మార్చి 27న రామ్‌చరణ్‌ బర్త్ డే కానుకగా టైటిల్‌, టీజర్‌ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.