పుష్ప : సగం మంది పిల్లలు చెడిపోయారని స్కూల్ టీచర్ ఆవేదన  

by | Feb 26, 2025 | వార్తలు

పుష్ప సినిమా చూసి సగం మంది పిల్లలు చెడిపోయారని స్కూల్ టీచర్ ఆవేదన.  పుష్ప సినిమా తీసింది కూడా గతంలో  ఒక లెక్కల మాష్టారు.

పిల్లల హెయిర్ స్టైల్, వాళ్ళు మాట్లడే వల్గర్ భాష. ఇవేమి పట్టించుకోకుండా మేము ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడుతున్నాం.  

ఒక టీచర్ గా పిల్లవాడికి అని నేర్పిస్తాం. పిల్లవాడిని పైకి తీసురావడానికే ప్రయత్నిస్తాం. కానీ హెయిర్ స్టైల్ గురించి పేరెంట్స్ కి చెప్పి నా మార్పు రాదు.  తల్లి తండ్రులు కూడా మా మాట వినడం లేదు.  మేము ఏమి చేయాలి.  పేరెంట్స్ పిల్లాడు మా మాట వినట్లేదని చెపుతారు

ఆ హెయిర్ స్టైల్ చూస్తే మేము ఓర్చుకోలేము.  ఆ హెయిర్ స్టైల్ చూస్తే పక్షులు గుడ్లు పెట్టేట్టు ఉన్నాయి అని అన్నా పిల్లలలో చలనం లేదు. ఇది అన్ని స్కూల్ లో పేస్ చేస్తోన్న సమస్య అని టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు

ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో ఇదే పరిస్థితి. చెప్పిన మాట వినరు ఈజీ గా తీసుకుంటారు. ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే భయం.  పిల్లాడు లెక్కల టీచర్ కొట్టాడు అందుకనే నేను సూసైడ్ చేసుకున్న అంటాడు. పిల్లల్ని చూసి మేము భయపడుతున్నాం. సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది   

ఒక టీచర్ గా ఒక పిల్లవాడికి నువ్వు చేసేది తప్పురా అని చెప్పలేకపోతున్నాం.  అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ గా నేను ఫెయిల్ అయినట్టే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక టీచర్ గా కూడా ఫెయిల్ అయినట్లే.  మరి దీని మీద ఫోకస్ ఎందుకు చేయడం లేదు.

మీడియా ప్రభావం తో పిల్లలు ఇలా తయారవుతున్నారు.  మీడియా గురించి ఎవరు ఎందుకు మాట్లాడారు. సినిమాలకు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు. పుష్ప సినిమా చూసి నా స్కూల్ లో సగం మంది పిల్లలు చెడిపోయారని ఒక ఉపాధ్యాయురాలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది

పిల్లలని జెర్మ్స్ లా తయారు చేయాలనీ ఉంది. కానీ మీడియా పిల్లలని చెడగొడుతోంది. ఆలాంటి సినిమాలకు సరిఫికేట్ ఎలా ఇస్తారు అని యూసఫ్ గూడ హై స్కూల్ HM తీవ్ర ఆవేదనను వ్యకం చేశారు

అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ అని కులాల పేరు హాస్టల్స్ కు పెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. కులాల పేరుతో హాస్టల్స్ పెట్టద్దని రిక్వెస్ట్ చేశారు

స్కూల్ లో పిల్లలకు నువ్వు చేసేది తప్పు అని టీచర్ చెప్పకూడదు.  అంటువంటప్పుడు పిల్లవాడికి ఏది మంచి, ఏది చెడు అని ఎలా తెలుస్తుంది.  మేమిచ్చే పనిష్మెంట్ లు పిల్లవాడిని అభివృద్ధి చేసేలా ఉంటుంది.  ఒక టీచర్ పిల్లవాడికి నువ్వు చేసేది తప్పు ధైర్యంగా చెప్పగలగాలి అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఆలా లేకపోతే ఈ సమాజం బాగుపడదు

పేరెంట్, టీచర్ మీటింగ్ కి కూడా 9వ తరగతి వరకు పేరెంట్స్ రారు. 10 వ తరగతిలో మీటింగ్ కు వచ్చి మా పిల్లలకు మార్కులు రావడం లేదు అంటారు.  తల్లి తండ్రులు, పిల్లలు మా మాట వినడం లేదు అని తప్పించుకోకూడదు.  పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. పిల్లవాడి చదువు, ప్రవర్తన, హెయిర్ స్టైల్, బాషా, స్కూల్ కు ఎప్పుడు వెళుతున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏం చదువుతున్నాడు అని చూసుకోవాల్సిన బాధ్యత తల్లి తండ్రులదే.  స్కూల్ యాజమాన్యాలు పని టీచర్లకు అన్ని విషయాలలో మద్దతు ఇవ్వాలి.

తెలుగు సినిమా రచయితలు, దర్శకులూ ఒక ఉపాధ్యాయురాలు ఆవేదన వినండి. మీరు తీసే సినిమాలు సమాజాన్ని మంచి వైపు ప్రభావితం చేసేలా ఉండాలి. కధ మీద దృష్టి పెట్టండి.

ఈ ఉపాధ్యాయురాలు చెప్పిన మాటలను రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సీరియస్ తీసుకోవాలి. రెండు విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  మొదటిది సమాజం మీద చేదు ప్రభావం చూపే సినిమాలకు అనుమతులు ఇవ్వకూడదు.  అవసరమైతే సినీ పెద్దలతో కూర్చుని మాట్లాడాలి. రెండవ విషయం, కులాల పేరుతో హాస్టల్స్ ను విభజించకూడదు. విద్యార్థి స్థాయి నుండి పిల్లలకు కుల గజ్జి అంటించద్దు.

యూసఫ్ గూడ హై స్కూల్ HM ని ప్రగడ టీవీ అభినందిస్తోంది