‘దేవర’ స్ట్రాటజీ ఫాలో అవుతున్న నీల్!

by | Feb 26, 2025 | సినిమా

‘దేవర’ స్ట్రాటజీ ఫాలో అవుతున్న నీల్.. ఎన్టీఆర్‌ కోసం పక్కా వ్యూహం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతేడాది దేవ‌ర మూవీతో ఎన్టీఆర్ భారీ హిట్ అందుకున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ మూవీ తరువాత క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel( దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. #NTRNeel అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ (NTR) ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ఇప్ప‌టికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్ లేకుండా కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తునట్లు తెలుస్తోంది. కాగా, మార్చి మూడో వారం నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో కూడా ‘దేవర’ మూవీ తరహాలోనే బీచ్ కు సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆంధ్రప్రదేశ్ లోని ఓ బీచ్  పరిశీలించారట. అక్కడ లొకేషన్ నచ్చడంతో తదుపరి షెడ్యూల్ ను అక్కడ ప్లాన్ చేసి ఎన్టీఆర్ మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. దీన్ని బట్టి చూస్తే దేవర సినిమా స్ట్రాటజీని ఫాలో అవుతూనే ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్‌ పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.