రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్డమ్’ (Kingdom) ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది.
అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని (Nani) పుట్టినరోజు కానుకగా శైలేష్ కొలను దర్శకత్వంలోతెరకెక్కుతున్న హిట్ 3 (HIT) మూవీ టీజర్ (Teaser) రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ టీజర్ విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూవీకి ఉహించని షాకిచ్చింది. ఇటీవలే విడుదలైన ‘కింగ్డమ్’ మూవీ టీజర్‌కి ఇప్పటివరకు15 మిలియన్ వ్యూస్ రాగా.. హిట్ 3 మూవీ టీజర్ విడుదలైన 18 గంటల్లోనే 16 మిలియన్ వ్యూస్ సాధించి ‘కింగ్డమ్’ని వెనక్కి నెట్టింది. మరి ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయి అనేది చూడాల్సిఉంది. కాగా, హిట్’ ఫ్రాంచైజీలో ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలూ సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. హిట్-1లో విశ్వక్సేన్, హిట్-2లో అడివి శేషు హీరోలుగా నటించగా, ఈ హిట్-3లో నాని కథానాయకుడిగా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ఇందులో నాని అర్జున్ సర్కార్‌గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

