అల్లు అర్జున్ (Allu Arjun) , రష్మిక (Rashmika) మంధన నటించిన పుష్ప-2 బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన విషయం మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ (Sukumar) దర్శకుడు. పుష్ప-2 (Pushpa 2) ఇండియా లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ 1871 కోట్లు వసూలు చేసినట్లు మైత్రి మూవీ మేకర్స్ వారు పోస్టర్ కూడా వదిలారు. ముఖ్యంగా పుష్ప-2 బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పారేసింది.
ఒక తెలుగు డబ్ సినిమా హిందీ 900 కోట్లు వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు. అంటే పుష్ప-2 క్యారెక్టర్ బాలీవుడ్ ఆడియన్స్ ఎంతగా అలరించిందో తెలుస్తుంది.
ఈ చిత్రం మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చి పెట్టిన చిత్రం పుష్ప 2. పుష్ప 1 కు అల్లు అర్జున్ (Allu Arjun) కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తెచ్చి పెట్టింది
ఇప్పుడు పుష్ప 2 ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ (World Television Premiere ) గా దక్షిణాది భాషలన్నిటిలో ప్రసారం చేయబోతున్నట్లుగా జియో స్టార్ వారు ప్రకటించారు.
ఏప్రిల్ 13 ను స్టార్ మా (Star Maa) , స్టార్ సువర్ణ, ఏసియానెట్ చానెల్స్ ప్రసారం చేయన్నునారు. తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా స్టార్ విజయ్ లో ఏప్రిల్ 14 న ప్రసారం చేయనున్నారు


