వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ కి వచ్చింది ఎందుకు అన్న ఆలోచనలు అందరికి వస్తాయి.
జగన్ అసెంబ్లీ కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, భారత రాజ్యాంగము లోని 10 వ షెడ్యూల్ ప్రకారం ఎన్నికైన ఏం ఎల్ ఏ ఎవరైనా సరైన కారణం లేకుండా, సంబంధింత అధికారులకు సమాచారం ఇవ్వకుండా, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానట్లైతే, ఆ వ్యక్తికి షో కాజ్ నోటీసు పంపే అధికారం స్పీకర్ కు ఉంటుంది. అంతే కాకుండా, సదరు వ్యక్తిని డిస్ క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. దానివలన ఉప ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంటుంది
అందుకే జగన్ అసెంబ్లీకి వచ్చారా అన్నట్లుగా ఉంది. అంతే కాకుండా వైస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కావాలని పట్టుపడుతోంది. ప్రతిపక్ష హోదా కావాలంటే అసెంబ్లీ లోని మొత్తం సీట్లలో 1/10 వంతు రావాలి. అంటే 175 సీట్లు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో 1/10 వంతు అంటే 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ వైస్సార్సీపీ గెలుచుకున్న సీట్లు కేవలం 11 మాత్రమే
ఈ రెండు విషయాలలో జగన్ మళ్ళీ తప్పు చేస్తున్నాడా. ప్రతిపక్ష హోదా ఇచ్చిన, ఇవ్వకపోయినా, ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీ తన గొంతు వినిపించాలి.
జగన్ గుంటూరు మిర్చి యార్డ్ కు వెళ్లిన తరవాతే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారా అనిపిస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్వింటా 11,781 రూపాయలు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఈ క్రెడిట్ చంద్రబాబు ఖాతాలోకి వెళ్తుంది. ఇలాంటి అవకాశాలను జగన్ ఉపయోగించుకోలేకపోతున్నాడా అనిపిస్తోంది
ఎంత లేదన్న ఇంకా నాలుగు సంవత్సరాలు కూటమి ప్రాంభుత్వం అధికారంలో ఉంటుంది. గెలిచింది 11 సీట్లు మాత్రమే అయినా సుమారు 40% ఓటు షేర్ వచ్చింది. ఈ ఓట్ బ్యాంకును పదిలంగా కాపాడుకోవాలి అంటే జగన్ అండ్ టీం అసెంబ్లీ కి రావాలి. ప్రజా సమస్యలపై పోరాడాలి

