నాని బర్త్ డే స్పెషల్.. ‘ది ప్యారడైజ్‌’ మూవీ క్రేజీ అప్డేట్! 

by | Feb 24, 2025 | సినిమా

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం జోరు మీదున్న సంగతి తెలిసిందే. నాని, దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఈ మూవీని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ది పారడైజ్‌ మూవీ కోసం నాని సరికొత్తగా కనిపిస్తారని తెలుస్తోంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్‌లో వచ్చిన ‘దసరా’ చిత్రం పలు అవార్డులను అందుకోవడం, హ్యుజ్ పాపులారిటీని సాధించడంతో ఇప్పుడు రాబోతోన్న ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడాయి. ఈ క్రమంలోనే శ్రీకాంత్‌ ఓదెల ఇప్పటి వరకు ఎవరు టచ్‌ చేయని పాయింట్‌ను తీసుకుని ఈ సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. 

కాగా, ఈ సినిమాలో నానికి జోడీగా నటించబోతున్న హీరోయిన్‌ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ సంగీతం అందింస్తున్నారు. తాజాగా నాని బర్త్ డే సందర్భంగా ‘ది ప్యారడైజ్‌’ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా గ్లింప్స్‌ను మార్చి 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు. మార్చి 3న ది ప్యారడైజ్‌ నుంచి రా స్టేట్మెంట్ రాబోతుంది. వచ్చే వారం వైల్డ్‌ రైడ్‌ ఉండబోతుంది అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది.