దేవర ఆగమనం ఎప్పుడు?

by | Feb 24, 2025 | టీవీ & ఓటిటి

తారక్ హీరో గా, జాహ్నవి కపూర్ హీరోయిన్ గా 2024 సెప్టెంబర్ చివరలో వచ్చిన సినిమా దేవర.  ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.

సినిమా టాక్ అంత గొప్పగా లేనప్పటికీ, దసరా సెలవులను బాగానే కాష్ చేసుకుంది ఈ దేవర సినిమా. మీడియాలో అయితే, ప్రప్రపంచ వ్యాప్తంగా దేవర వసూళ్లు సుమారు 500 కోట్ల అని అంటున్నారు. అయితే అంత సూపర్ హిట్ అయిన దేవర సినిమా ఇంకా ఏ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కాలేదు.  డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను మాత్రం నెట్ ఫ్లిక్ దక్కించుకుంది.  

దేవర పార్ట్ 2 కూడా ఉందంటున్నారు. దేవర పార్ట్ 1 సాటిలైట్ హక్కులే అమ్ముడుపోవట్లేదని తెలుస్తోంది.

థియేటర్ లో అంత పెద్ద హిట్ అయిన సినిమా (మీడియా కలెక్షన్స్ ప్రకారం) సాటిలైట్ హక్కులను ఎందుకు, ఎవరు కొనలేదు. సినిమా విడుదలకు ముందే సాటిలైట్, డిజిటల్ హక్కులను అమ్మేసే ఈ రోజుల్లో, సినిమా విడుదలై 5 నెలలు అయినా దేవర సినిమా ను, ఏ ఛానల్ ఎందుకు కొనలేదు.  బహుశా మేకర్స్ ఎక్కువ మొత్తం అడిగి ఉండుంటారు.

తారక్ అభిమానులకు, ముఖ్యం గా కుటుంబ ప్రేక్షకులలో ఉండే తారక్ అభిమానులకు ఇది మింగుడు పడని వార్త.  అతి త్వరలో ఈ సినిమా టెలివిజన్ లో, వరల్డ్ టెలివిజన్  ప్రీమియర్ గా వస్తుందని ఆశిద్దాం