టాలీవుడ్ సీనియర్ హీరో, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manchu Vishnu) కళల ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప (Kannappa) ‘. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వివిధ భాషలకు చెందిన నటీనటులు భాగమయ్యరు. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas) , మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) వంటి అగ్ర హీరోలు కూడా నటిస్తున్నారు.
తాజాగా ఈ కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘చిన్న వయసునుంచే భక్తి సద్గుణాలను అలవరచుకున్నాను. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించే వ్యక్తిత్వం నాది. నా ఎదుట పరమశివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలని అడిగితే జన్మజన్మలకు మోహన్‌బాబునే నాకు తండ్రిగా ఇవ్వాలని కోరుకుంటాను. నాకు మా అమ్మానాన్నలతో కలిసి ఉండాలని ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టం. నా పిల్లలు కూడా ఉమ్మడి కుటుంబంలో పెరగాలని కోరుకుంటా. మా కుటుంబంలో జరుగుతున్న గొడవలకు త్వరగా ముగింపు పడితే బావుండేది’ అని మంచు విష్ణు పేర్కొన్నారు.
కాగా, మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ‘కన్నప్ప’ మూవీలో మోహన్‌బాబుతో పాటుగా శరత్‌కుమార్, మధుబాల, ముఖేష్‌రిషి, బ్రహ్మానందం బ్రహ్మాజీ, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది

