టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుంది. డెబ్యూ యాక్టర్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కాగా, కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ పార్టులో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్, గోపికా ఉద్యన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
కాగా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌లను విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా, తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ అప్డేట్ను పంచుకున్నారు చిత్ర బృందం. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. బాయ్స్ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్తో కమ్ బ్యాక్ చేస్తున్నట్లు ఈ పోస్టర్ తెలియచేస్తుంది.

