చిరు – శ్రీకాంత్ ఓదెల మూవీ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్!

by | Feb 22, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ బ్యాగ్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. మెగాస్టార్ తన తర్వాతి చిత్రాన్ని ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సైతం మెగా ఫాన్స్ తో ఓటుగా సినీ ప్రేమికుల్లో ఆతృతను కలిగించింది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించబోతున్నారని, ఇందులో మెగాస్టార్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ సరికొత్త మేకోవర్‌కు సిద్ధమవుతున్నారని సమాచారం.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ పాత్రను శ్రీకాంత్‌ ఓదెల ఇంటెన్సివ్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పాత్ర కోసం బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్‌ ఓదెల చెప్పిన స్క్రిప్ట్ తో పాటుగా తన రోల్ ను డిజైన్ చేసిన తీరుకు ఫిదా అయిన రాణీ ముఖర్జీ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే దీనిపైనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమాకు హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. భారీ బడ్జెట్ తో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.