అక్షర్ పటేల్ హ్యాట్రిక్ ని మిస్ చేసిన రోహిత్ శర్మ

by | Feb 20, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు భారత, బంగ్లాదేశ్  జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో అక్షర్ పటేల్ కు హ్యాట్రిక్ తీసే అవకాశం వచ్చింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ వదిలేయడంతో ఆ అవకాశం తప్పిపోయింది. రోహిత్ శర్మ కూడా చేతితో గ్రౌండ్ ని కొడుతూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అక్షర్ పటేల్ కు  అపాలజీ చెప్పిన రోహిత్ శర్మ

అయితే టాస్ గెలిచిన బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కడపటి వార్తలందేసరికి, 12 ఓవర్ల లో,  5 వికెట్ ల నష్ఠానికి 49 పరుగులు చేసింది.  జేకర్ 6 పరుగులతో, హ్రిదయ్ 10 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు

కీలక బంగ్లా ఆటగాళ్లు కెప్టెన్ శాంతో, సౌమ్య సర్కార్, ముషఫికర్ రహీమ్ లు డక్ అవుట్ అయ్యారు

భారత బౌలర్ల లో షమీ, అక్షర్ పటేల్ లు చెరోరెండు వికెట్లు తీశారు. హర్షిత్ రానా ఒక వికెట్ తీశాడు. అక్షర్ పటేల్ రెండు వరస బంతుల్లో  వికెట్లు తీశాడు. హ్యాట్రిక్ వికెట్ గా బంగ్లా బాట్స్ మన్ జేకర్ ఇచ్చిన క్యాచ్ ను రోహిత్ శర్మ స్లిప్ లో వదిలేశాడు