బాలీవుడ్ యువ కథనాయకుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ దీంట్లో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా పోషించారు. ఇక ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. మొత్తంగా తొలి అయిదు రోజుల్లో రూ.171.28 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ. 200 కోట్ల మైలురాయికి మరింత చేరువైంది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఛావా’ గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ‘ఛావా’ మూవీ స్టోరీ తొలుత సూపర్ స్టార్ మహేశ్ బాబు దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది. ‘ఛావా’ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాలో శంభాజీ మహరాజ్ పాత్ర కోసం తొలుత మహేశ్ బాబును సంప్రదించగా.. సినిమా కథ, తన పాత్ర నచ్చకపోవడంతో మహేశ్ బాబు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఆ తర్వాత దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ శంభాజీ రోల్ కోసం విక్కీ కౌశల్ ను సంప్రదించగా.. వెంటనే విక్కీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మహేశ్ బాబుకు సినిమాలు రిజెక్ట్ చేయడం ఇదేమి తొలిసారి కాదు. అంతకుముందు కొత్తేమి కాదు. ఇంతకుముందు కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్, మురుగదాస్ దర్శకత్వంలో గజిని, సుకుమార్ దర్సకత్వంలో పుష్ప, శేఖర్ కమ్ములతో లీడర్, సందీప్ రెడ్డి వంగాతో యానిమల్ వంటి సూపర్ హిట్ సినిమాలను కథ నచ్చకపోవడంతో మహేశ్ బాబు రిజెక్ట్ చేశారు.

