యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్ తో యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పై జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో పాటను తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసున్నది. ఇందులో హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తారట.
అయితే ఈ సినిమా రచయిత అబ్బాస్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ను పంచుకున్నారు. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న వార్2 మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. వీరిద్దరూ ఒకరిని మించి మరొకరు నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. వార్ 2లో అద్భుతమైన డైలాగ్స్ రాశాను. మీ అందరికీ ఇవి కచ్చితంగా నచ్చుతాయి. ఆగస్టు25న. థియేటర్లలో కలుద్దాం అని రైటర్ అబ్బాస్ చెప్పుకొచ్చారు. కాగా, యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో 6వ చిత్రంగా, 2019లో వచ్చిన ‘వార్’ సీక్వెల్ గా ‘వార్ 2’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉండే స్పై ఏజెంట్ పాత్రలో కనిపిస్తారనే టాక్ నడుస్తోంది.

