నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను తెరకెక్కిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పర్వదినం కానుకగా అఖండ 2 లో బాలయ్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం అఖండ 2 మూవీలో కథ దృష్ట్యా బాలయ్య పోషిస్తున్న అఘోరా పాత్రను ఢీకొట్టే విలన్ పాత్ర ఒకటుందట. ఈ పాత్ర కోసం దర్శకుడు బోయపాటి బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్‌ను సంప్రదించగా.. కథ నచ్చడంతో వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో బాలయ్య, సంజయ్ దత్ పాత్రల మధ్య వచ్చే పోరాట ఘట్టాలు హోరాహోరీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో వివిధ భాషలనుంచి నటీనటులను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా, అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సంగీతం అందిస్తున్నారు.

