టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా ‘తండేల్’. యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ క్రమంలోనే తండేల్ సినిమా ఇటీవలే 100 కోట్ల క్లబ్లో చేరింది. నాగ చైతన్య కెరీర్లో వంద కోట్ల కలెక్షన్స్ సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. తండేల్ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎప్పుడొస్తుందా అని అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. తండేల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ మంచి ధరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలైన సరిగ్గా నెల రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నట్లుగాతెలుస్తోంది. దాంతో ఫిబ్రవరి 7న తండేల్ మూవీ థియేటర్లలో విడుదలవ్వగా.. మార్చి 7 శుక్రవారం నుంచి తండేల్ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కాగా, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవ్వగా… మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ సినిమాలో కరుణాకరన్, దివ్య పిళ్లై, జబర్దస్త్ మహేష్ కీలకపాత్రల్లో అలరించారు.

