ఓ టి టి ప్లేట్ ఫామ్ ‘ఆహ’ దూకుడు మీద ముంది. మొదటి ప్రాంతీయ ఓ టి టి ప్లాట్ ఫామ్ అని ప్రమోట్ చేస్తోన్న ఆహ వరసపెట్టి కొత్త షో లను లాంచ్ చేస్తోంది.
ఇప్పటికే ఓంకార్ తో డాన్స్ ఐకాన్ సీజన్ 2 ని లాంచ్ చేస్తున్నారు. డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ నెల 21 న సాయంత్రం 7 గంటల నుండి ఆహా లో స్ట్రీమ్ అవబోతోంది
డాన్స్ ఐకాన్ సీజన్ 1 అంతగా ఆకట్టుకోలేదు. ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 1 ని జెమినీ టీవీ లో ప్రసారం చేసినప్పుడు రేటింగ్ లు చాల దారుణంగా వచ్చాయి. ప్రేక్షలు ఈ షోని రిజెక్ట్ చేశారు. అయితే ఆహ వారు మాత్రం కొంత జెమినీ కి అమ్మడం ద్వారా కొంత సొమ్ము చేసుకుంది ఉంటారు.
ఇప్పుడు, మరో కొత్త షో ని లాంచ్ చేయబోతున్నారు. ఈ సారి సుమ హోస్ట్ గా చెఫ్ మంత్ర – ప్రాజెక్ట్ కె అనే షో ని లాంచ్ చేయబోతున్నారు. ఇది కుకింగ్ షో మాత్రమే కాదు. ఈ షో లో కుకింగ్, కామెడీ, ట్విస్ట్ లు అన్ని మసాలాలు ఉన్న అల్టి మేట్ కుకింగ్ ఎంటటైన్మెంట్ అని చెపుతున్నారు. బహుశా మార్చిలో ఉగాది పండగ కు ఈ షో ని లాంచ్ చేయవచ్చు

