నెవర్‌ బిఫోర్‌ అనిపించే లెవల్లో రామ్‌చరణ్‌-సుకుమార్ మూవీ

by | Feb 19, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) నటిస్తున్న 16వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆర్సీ16’ అనే వర్కింగ్ టైటిల్‌ తో తెరకుక్కుతోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram Charan) సీనియర్ డైరెక్టర్ సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ అయింది. దాంతో ఈసారి ఎలాంటి నేపథ్యంలో సినిమా చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. రామ్‌చరణ్‌ కెరీర్‌లో ఇది 17వ చిత్రంగా రూపొందనుండగా.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని సమాచారం. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’లో చిట్టిబాబు క్యారెక్టర్ లో రామ్ చరణ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పూర్తి డిఫరెంట్ గా రామ్ చరణ్ పాత్రని సుకుమార్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ‘రంగస్థలం’లో పల్లెటూరి యువకుడి పాత్ర పోషించిన రామ్ చరణ్ ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్‌ గా మోడరన్‌ లుక్స్‌తో అలరించనున్నాడట. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రష్మికా మందన్నాని హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రెండో అర్థ భాగంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.