బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కథానాయకుడుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘ఛావా’. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో రూపొందిన ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై తొలి రోజే హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తొలి రోజు ఏకంగా రూ.31 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాదిలో మూడు రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘ఛావా’ రికార్డును ఖాతాలో వేసుకుంది.
‘ఛావా’ సినిమా ఈ వీకెండ్‌లో బాక్సఫీస్ వద్ద రూ. 164.75 కోట్లు భారీ కలెక్షన్లు రాబట్టింది. దాంతో 2025లో మూడు రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి హిందీ సినిమాగా ఛావా నిలిచింది. 2025 జనవరిలో విడుదలైన అక్షయ్ కుమార్ ‘స్కైఫోర్స్’ సినిమా మొదటి మూడు రోజుల్లో రూ. 140 కోట్లు కలెక్షన్స్ సాధించగా.. తాజాగా స్కైఫోర్స్ సినిమా వసూళ్లను ఛావా చిత్రం బ్రేక్ చేసింది. ఛావా మూవీకి తొలి మూడు రోజుల్లో మొత్తంగా రూ. 164.75 కోట్లు రాగా.. మన దేశంలో రూ. 139 కోట్లు ఓవర్సిస్ లో రూ.25 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే విక్కీ కౌశల్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. కాగా శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించగా.. ఎ.ఆర్.రహమాన్ బాణీలు అందించారు.

