‘SSMB29’ క్రేజీ అప్ డేట్‌.. హైదరాబాద్‌కు ప్రియాంక చోప్రా

by | Feb 17, 2025 | సినిమా

దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ నిర్మించే ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. అన్ని భాషల్లోనూ దీనిని రీమేక్ చేయనున్నారు. సినిమాలో మహేష్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు చూడని కొత్త లుక్‌తో కనిపిస్తారని తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది.

అయితే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే ప్రియాంక చోప్రా తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా -నీలం ఉపాధ్యాయల వివాహ వేడుకల కోసం ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణ కోసం ప్రియాంక చోప్రా మళ్లీ హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం రోజు ఈ మళ్లీ మూవీ సెట్స్ లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. హైద్రాబాద్ లో షూటింగ్ షెడ్యూల్ ముగిసాక చిత్రబృందం మే మొదటి వారంలో కెన్యా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడి దట్టమైన అడవుల్లో ఈ సినిమా అగ్ర భాగం చిత్రీకరణ జరుపుకోనున్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే.. ఈ సినిమా టైటిల్‌ విషయంలో మాత్రం చిత్రబృందం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రారంభానికి ముందు గరుడ, మహారాజ్‌ లాంటి టైటిల్స్ వినిపించినప్పటికీ ఏది ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చేస్తూనే టైటిల్‌ ఫిక్స్ చేసే పనిలో దర్శకుడు రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది