రికార్డులను కొల్లగొట్టిన ‘తండేల్‌’.. ‘చైతూ’కి బిగ్గెస్ట్‌ మైల్‌స్టోన్‌‌

by | Feb 17, 2025 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా ‘తండేల్’. యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తండేల్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తాజాగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. నాగ చైతన్య కెరీర్‌లో వంద కోట్ల కలెక్షన్స్ సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబం నుంచి తొలిసారి 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా నాగచైతన్య నిలిచాడు.

తండేల్‌ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా మంచి బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అక్కడ 1 మిలియన్ మార్కును దాటినట్లు సమాచారం. కాగా, ‘తండేల్’ సినిమా కచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని విడుదలకు ముందే చెప్పిన ప్రొడ్యూసర్ బన్నీ వాసు తాజాగా ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే బన్నీ వాసు ‘మేము ప్రామిస్ చేశాము. దాన్ని నిలబెట్టుకున్నాము అని ట్విట్టర్ వేదికగా ‘తండేల్’ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిన పోస్టర్ షేర్ చేశాడు. కాగా, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవ్వగా… మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ సినిమాలో కరుణాకరన్, దివ్య పిళ్లై, జబర్దస్త్ మహేష్ కీలకపాత్రల్లో అలరించారు.