యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం

by | Feb 16, 2025 | వార్తలు

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.  39 పరుగులు చేసిన కెప్టెన్ దీప్తి శర్మ యూపీ వారియర్స్ లో టాప్ స్కోరర్.

గుజరాత్ జెయింట్స్ బౌలర్ల లో ప్రియా మిశ్రా మూడు వికెట్లు తీయగా, గార్డనర్, డాటిన్ చెరో రెండు వికెట్లు తీశారు.  కాశ్వీ ఒక వికెట్ తీసింది

144 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్ కు మొదటి ఓవర్ లోనే షాక్ తగిలింది

ఓపెనర్ మూని తాను ఆడిన మొదటి బంతికే డక్ అవుట్ అయ్యారు.  రెండవ ఓవర్ లో హేమలత కూడా డక్ అవుట్ అయ్యారు.  అయితే కెప్టెన్ గార్డనర్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించింది. గార్డనర్ 32 బంతుల్లో 52 పరుగులు చేసింది.  మరో ఓపెనర్ లారా వల్వర్ట్ 22 పరుగులు చేసి అవుట్ అయ్యింది 

ఆ తర్వాత వచ్చిన డాటిన్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు ను కదిలించింది.  మరో పక్క హార్లిన్ డియోల్ నిలకడగా ఆడుతూ డాటిన్ కు మద్దతు ఇచ్చింది.  వీరిద్దరూ ఐదవ వికెట్ కు 58 పరుగులు జోడించారు

హార్లిన్ డియోల్ 30 బంతుల్లో 34 పరుగులు , డాటిన్ 18 బంతుల్లో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచారు

యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ రెండు వికెట్లు తీయగా, మెక్ గ్రాత్, హారిస్ చెరో వికెట్ తీశారు.

అల్ రౌండ్ ప్రదర్శనతో 52 పరుగులు చేసి, 2 వికెట్లు తీసిన గార్డనర్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది