రష్మిక మందన ఇండియా లో నెంబర్ వన్ హీరోయిన్!

by | Feb 16, 2025 | ప్రగడ టీవీ

రష్మిక మందన ఇండియా లో నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటె రష్మిక మందన నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.

రష్మిక మందన కన్నడ చిత్రాలతో కెరీర్ ప్రారంభించింది.  2016 లో కిరిక్ పార్టీ తో అరంగేట్రం చేసిన రష్మిక, ఆ తరవాత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో అంజనీపుత్ర, గోల్డెన్ స్టార్ గణేష్ తో చమక్ చిత్రాలలో నటించింది.

2018 లో నాగ శౌర్యతో చేసిన చలో తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతో పాటు రష్మిక కి పేరు వచ్చింది.  ఆ తరవాత విజయ్ దేవరకొండ తో చేసిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  ఈ సినిమా థియేటర్ లో, టెలివిజన్ లో సూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమాతో విజయ్ దేవర కొండ, రేష్మక కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.  అప్పటితో మొదలైన వీరి రిలేషన్ షిప్ ఇప్పటికి కొనసాగుతూ ఉంది.  అయితే ఆ తర్వాత వచ్చిన దేవదాస్, డియర్ కామ్రేడ్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. 

ఈ మధ్యలో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తో కన్నడ లో యజమాని అనే సినిమా చేసింది.  కమర్షియల్ గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది

తెలుగులో రష్మిక మొదటి సారిగా ఒక పెద్ద స్టార్ తో సినిమా చేయడం సరిలేరు నీకెవ్వరుతో మొదలైంది.  మహేష్ బాబు తో చేసిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు.  ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  నితిన్ చేసిన భీష్మ కూడా హిట్ అయ్యింది

అయితే అసలు రష్మిక హవా 2021 నుండి ప్రారంభమయ్యింది. 2021 పుష్ప తో మొదటిసారి పాన్ ఇండియా హిట్ కొట్టింది.  పుష్ప మొదటి భాగం బాలీవుడ్ లో ఊహించినదాని కన్నా పెద్ద హిట్ అయ్యింది.  2022 లో సీతారామం సినిమాలో అఫ్రీన్ పాత్రలో కూడా చాలా బాగా నటించింది

2023 లో రణభీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమా కూడా సూపర్ హిట్.  2024 లో పుష్ప-2 ఇండియా లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  ఇప్పుడు 2025 లో రీసెంట్ చావా సినిమాలో విక్కీ కౌశల్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది

తమిళం లో కార్తీ తో సుల్తాన్ సినిమా చేసింది. అంతే కాకుండా దళపతి  విజయ్ తో వరిసు (తెలుగు లో వారసుడు) అనే సినిమా చేసింది.  ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తో కుబేర అనే సినిమా చేస్తోంది.  ఈ సినిమా తెలుగు, తమిళం లో రిలీజ్ చేయబోతున్నారు

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో సినిమాలు చేసిన రష్మిక ఇప్పటివరకు మలయాళంలో ఇంకా సినిమా చేయలేదు

రష్మిక నటించిన సూపర్ హిట్ పాత్రల స్వభావాలను చూద్దాం

పుష్ప లో, రష్మిక శ్రీ వల్లి  అనే పల్లెటూరి పిల్ల పాత్రలో అమాయకం, ధైర్యం కలగలసిన పాత్ర. అంతే కాకుండా ప్రేమను చూపించే పాత్రలో ఒదిగిపోయింది

సీతా రామంలో ఆఫ్రీన్ పాత్ర అనేది ధైర్యం, నిస్వార్థత మరియు స్నేహంతో పాటు  ప్రేమ మరియు అనురాగం వ్యక్తం చేసే ఒక అద్భుతమైన యువతీ గా నటించింది

తన కుటుంబం కోసం బలం గా నిలబడడమే కాకుండా, తన కుటుంబాన్ని కాపాడుకునే  బలమైన పాత్రలో నటించింది.  ఈ పాత్రకు కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి.  ఇలాంటి పాత్రలో  రష్మిక మందన అద్భుతంగా నటించిందని చెప్పాలి.

చావా చిత్రంలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ శ్రీ సఖి (భార్య) మరియు మహారాణి యేసుబాయి పాత్రలో ధైర్యం, నిబద్ధతతో కూడిన పాత్ర.  ఏ క్షణంలో ను భర్త మీద నమ్మకం సడలిపోని ఒక ధైర్యవంతమైన పాత్ర లో నటించింది. కుటుంబం కోసం, రాజ్య ప్రజల కోసం ఎలాంటి పరిస్థితులని కూడా తీసుకోగలిగే ధీరోదాత్తమైన పాత్రలో బాగా నటించింది.

ఈ పాత్రలన్నీ ఒకదానికి మరొకటి సంబంధం లేదు.  ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేస్తోన్న రష్మిక పాన్ ఇండియా టాప్ స్టార్ అని చెప్పడానికి ఎవరికి అనుమానాలు అక్కర్లేదు. పుష్ప 1 మరియు 2, అనిమల్, చావా వరసగా పాన్ ఇండియా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఏకైక హీరోయిన్ రష్మిక మందన