యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 చేస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ` సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల కోసం ప్రభాస్ కొత్త లుక్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ప్రభాస్ ను ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానపత్రికను అందించారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ప్రభాస్ స్లిమ్‌గా ఉన్నాడు. ప్రభాస్‌ని చూస్తే ఏదో యాక్షన్ మూవీకి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఫొటోలో ప్రభాస్ ట్రిమ్ చేసిన గడ్డం, లాంగ్ హెయిర్‌తో టోపీ పెట్టుకుని కనిపించి ఆకట్టుకున్నారు. ఈ కటౌట్ తో సినిమా వస్తే అదిరిపోతుందని అభిమానులు సంబరపడుతున్నారు. ఈ ఫోటోను తెగ షేర్ చేస్తూ ఆనందపడుతున్నారు

