ఎన్టీఆర్ ట్రస్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 50 లక్షల విరాళం

by | Feb 15, 2025 | వార్తలు

తలసేమియా బాధితులకు సహాయార్ధం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ నేతృత్వంలో విజయవాడలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,  గౌ||  ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పాల్గొన్నారు.  ఇంకా ఈ కార్యక్రంలో మంత్రి లోకేష్ తో పాటు టాలీవుడ్ నటులు కూడా పాల్గొన్నారు.  ఈ ఈవెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు వీరిని సాదరంగా స్వాగతించారు.

ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ బాల కృష్ణ ను అభినందించారు.  ఎవరికి భయపడకుండా తాను  చేయాలనుకున్న పనిని ధైర్యంగా, చేసే వ్యక్తి బాల కృష్ణ అని అన్నారు.  బాల కృష్ణ సినిమాల్లోనే కాదు, సేవ చేయడంలో కూడా ముందుటారు.  అందుకే కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది అని అన్నారు పవన్ కల్యాణ్ గారు బాల కృష్ణను అందరు బాలయ్య అని పిలుస్తారు నాకు మంత్రం సర్ అని పిలవాలని ఉంటుంది అని అన్నారు

దీని కోసం టికెట్ కొనాల్సిందిగా పవన్ కళ్యాణ్ టీం కి చెప్పగా అవసరం లేదని భువనేశ్వరి గారు అన్నారని చెప్పారు. భువనేశ్వరి గారంటే నాకు అపార గౌరవం అని పవన్ కల్యాణ్ అన్నారు

అయితే  తనవంతు బాధ్యతగా, ఎన్టీఆర్ ట్రస్ట్ కు, 50 లక్షల విరాళాన్ని ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రకటించారు

ఈ కార్యక్రమంతో వచ్చిన డబ్బుతో తలసీమియా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని భువనేశ్వరి దేవి గారు చెప్పారు. 

బాల కృష్ణ తల్లి పేరుతో సేవలందిస్తున్నారు, భువనేశ్వరి తండ్రి పేరుతో సేవలందిస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. వీరిద్దరూ చేసే కార్యక్రమాలతో తల్లి, తండ్రులకు ఇంతకన్నా గౌరవం ఏముంటుంది. తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలందిస్తుంది అని అన్నారు