‘స్పిరిట్’ కోసం ‘కన్నప్ప’ మాస్టర్ ప్లాన్

by | Feb 15, 2025 | సినిమా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిత్రబృందం నటీనటుల ఎంపికపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాణ సంస్థ భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్ స్పిరిట్ సినిమాలో నటించేందుకు ‘క్యాస్టింగ్ కాల్’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ చేశారు.

సినిమా లేదా థియేట‌ర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి నటనపై ఆసక్తి ఉన్న వాళ్లు అప్లై చేసుకోవాలని తెలిపారు. ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. అయితే ఈ ఆడిష‌న్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు అప్లై చేసుకున్నట్లు సమాచారం. దీనిని మంచు విష్ణు ఎక్స్ వేదిక‌గా ధ్రువీకరించారు. రెబల్ స్టార్ ప్ర‌భాస్ ‘స్పిరిట్‌’ కాస్టింగ్ కాల్‌కి నేను కూడా అప్లై చేశాను. స్పిరిట్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి అని ట్వీట్ చేశారు. దాంతో ‘స్పిరిట్’లో మంచు విష్ణు ఏదైనా కీలక పాత్ర చేయబోతున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.. ఇప్పుడు ప్రభాస్ మూవీలో ఛాన్స్ కోసం మంచు విష్ణు అప్లై చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా, స్పిరిట్ మూవీకి హర్షవర్థన్‌ రామేశ్వర్‌ మ్యూజిక్ అందిస్తుండగా..ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, మాలీవుడ్ స్టార్ హీరో మమ్మూట్టి కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.