రవితేజ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. క్రేజీ కాంబోలో మూవీ ఫిక్స్!

by | Feb 13, 2025 | సినిమా

మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందిస్తుంన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా మే 9న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తరువాత
దర్శకుడు కిషోర్‌ తిరుమలతో
ఓ ఇంట్రస్టింగ్‌ ప్రాజెక్ట్‌కు రవితేజ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రవితేజ దర్శకుడు కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనునట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల రవితేజను కలిసిన కిషోర్‌ తిరుమల ఓ మాస్ ఫీస్ట్ స్క్రిప్ట్‌ వినిపించారట. ఇక కిశోర్‌ తిరుమల చెప్పిన కథ నచ్చడంతో రవితేజ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘మాస్‌ జాతర’ సినిమా తర్వాత కిషోర్‌ తిరుమల మూవీని సెట్స్‌ మీదకు తీసుకు వెళ్లాలని రవితేజ ఫిక్స్ అయ్యారట. అన్నీ అనుకూలిస్తే మే నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలవ్వగా.. పూర్తి విషయాలు త్వరలోనే అధికారికంగా వెళ్లాడయ్యే అవకాశం ఉంది. ఇక దర్శకుడు కిషోర్‌ తిరుమల విషయానికొస్తే.. ఆయన ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని హీరోగా ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగి’, అలాగే సాయితేజ్‌ హీరోగా ‘చిత్రలహరి’, శర్వానంద్‌ హీరోగా ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఏదేమైనా మాస్ హీరో రవితేజను, క్లాస్ డైరెక్టర్ అయిన కిషోర్ తిరుమల ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.