స్పిరిట్: ఒక్క మెయిల్‌తో ప్రభాస్‌తో సినిమా ఛాన్స్‌

by | Feb 13, 2025 | సినిమా

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రెబల్ స్టార్ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం సందీప్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన లుక్‌ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడుగా ఉండగా..ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, మాలీవుడ్ స్టార్ హీరో మమ్మూట్టి కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ పక్కన నటించేందుకు కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ‘స్పిరిట్’ చిత్రాన్ని ‘భద్రకాళి పిక్చర్స్’ ‘టి సిరీస్’ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ సినిమాకి సంబంధించి కాస్టింగ్ కాల్ అప్డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. వయసుతో సంబంధం లేకుండా నటనపై ఆసక్తి ఉన్న అన్ని వయసుల వారికి స్పిరిట్ మూవీలో నటించే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది.

ఇందుకుగాను ఆసక్తి ఉన్న అన్ని వయసుల వారు రెండు లేటెస్ట్ ఫోటోలతో పాటుగా 2 నిమిషాల నిడివి గల వీడియోలను అధికారిక మెయిల్ ఐడీ sirit.bhadrakalipictures@gmail.com పంపించాలని సూచించారు. నటనపై ఆసక్తి ఉన్న వాళ్లకు ఇది సువర్ణావకాశం అంటూ సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరి స్పిరిట్ మూవీలో ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో అన్నది చూడాలి.