బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో, బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ లు నటించిన చిత్రం ‘బాపు’. ‘ఏ ఫాదర్స్ స్టోరీ’ ఈ చిత్రం టాగ్ లైన్. ఈ చిత్రానికి దర్శకుడు దయా. ఈ చిత్రం ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్పవచ్చు.
ఫిబ్రవరి 21 న బాపు సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘బాపు’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

