టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రానికి 40 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. సోమవారం దాదాపు రూ.11 కోట్ల కలెక్షన్స్ సాధించగా, మంగళవారం రూ.7 కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి నాలుగు రోజుల్లో 73.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ‘తండేల్’ మూవీ 5వ రోజు నాటికి మొత్తంగా రూ.80.12 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని చిత్రబృందం ప్రకటించింది. ఇక నాగ చైతన్య కెరీర్‌లో ‘తండేల్’ సినిమానే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం. ప్రస్తుతం వాలెంటైన్స్ డే వీక్ కావడంతో వీకెండ్స్ లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరుగుతాయని, ఖచ్చితంగా వీకెండ్ పూర్తి అయ్యేసరికి రూ.100 కోట్ల మార్క్ దాటుతుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కాగా, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవ్వగా… మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ సినిమాలో కరుణాకరన్, దివ్య పిళ్లై, జబర్దస్త్ మహేష్ కీలకపాత్రల్లో అలరించారు.

