అవినీతి సూచీలో, భారత దేశానికి 96 వ స్థానం

by | Feb 12, 2025 | వార్తలు

ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం అవినీతి సూచీలో భారత దేశం 96 వ స్థానం లో ఉంది.  180 దేశాలకు సంబంధించిన నివేదిక భారత దేశానికి 96 వ స్థానం.  దేశం మొత్తం ఆలోచించాల్సిన విషయం

ఈ సూచీలో ‘0’ నుండి ‘100’ వరకు స్కోర్ ఇస్తారు.   సున్నా స్కోర్ అంటే పూర్తి అవినీతిమయం అని అర్ధం. ‘100’ స్కోర్ అంటే అవినీతి రహితం అని లేదా అందరి కంటే అవినీతి బాగా తక్కువ స్థాయిలో ఉందని అర్ధం

2023  (స్కోర్ 39)  పోలిస్తే 2024 (స్కోర్ 38) లో భారత దేశం లో అవినీతి స్థాయి పెరిగిందని సూచీ స్కోర్ తెలియచేస్తోంది.   

ఈ సూచీ ప్రకారం శ్రీలంక 121 వ స్థానం లో, పాకిస్థాన్ 135 వ స్థానంలో ఉన్నాయి.  ఇంకా డెన్మార్క్ మొదటి స్థానంలో ఉండగా, ఫిన్లాండ్ రెండవ స్థానంలో, సింగపూర్ మూడవ స్థానంలో ఉండగా, న్యూ జిలాండ్ నాలుగవ స్థానం లో ఉంది

అవినీతి సూచీలో, మన భారత దేశం,  గాంబియా, మాల్దీవ్స్ స్కోర్ (స్కోర్ 38) సమానంగా ఉన్నాయి.

ఈ విషయంపై, రాజకీయ నాయకులు, మేధావులతో చర్చకు వస్తారా అంటే రారనే చెప్పాలి.  అన్ని వార్తలు ఒకటికి, పది సార్లు  చెప్పే ఎలెక్ట్రానిక్ మీడియా ఈ న్యూస్ గురించి పెద్దగా చప్పుడు చేయడం లేదు.  ప్రింట్ మీడియా దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు.  లోపలి పేజీల్లో ఒక చిన్న ముక్క వేశారు.  మీడియా వాళ్లకు చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం మాట్లాడాడు లేదా జగన్ ఏం మాట్లాడాడు అలాంటివే కావాలి

https://www.transparency.org/en/cpi/2024?utm_source=twitter&utm_medium=social