‘లైలా’ రన్‌టైమ్‌ ఇదే..అదిరిన సెన్సార్ టాక్

by | Feb 12, 2025 | సినిమా

యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ కథానాయకుడుగా రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లైలా’. షైన్ స్క్రీన్ బ్యానర్​పై సాహు గరపాటి ఈ సినిమా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ​ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్​లో కనిపించనున్నారు.
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా, ఇటీవలే లైలా మూవీకి సెన్సార్ పనులు పూర్తవ్వగా.. కొన్ని బోల్డ్ సీన్స్ కారణంగా సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ విషయానికొస్తే.. 2 గంటల 16 నిమిషాలుగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మంచి రన్‌టైమ్‌తో వస్తున్న ఈ మూవీ యూత్ ఆడియన్స్ ను అలరించడం ఖాయమని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక తనిష్క్ బాగ్చి, జిబ్రన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్న ‘లైలా’ మూవీలో విశ్వక్​ సేన్ కు జోడీగా అందాల భామ ఆకాంక్ష శర్మ నటిస్తోంది. వెన్నెల కిషోర్, రవి మారియా, హర్ష వర్థన్, బ్రహ్మాజీ, రఘు బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు