విశ్వంభర’ క్రేజీ అప్డేట్‌..మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌

by | Feb 12, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘బింబిసార’ వంటి భారీ హిట్ తర్వాత వశిష్ట, మెగాస్టార్ చిరంజీవి మూవీకి డైరెక్షన్ చేసే ఛాన్స్ ను కొట్టేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్​లో జరుగుతుండగా.. ఇందులో మెగా స్టార్ తో ఓ సాంగ్​ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఓ భారీ సెట్​లో ఆరు వందల మంది డ్యాన్సర్లతో కలిసి చిరు స్టెప్పులు వెయ్యనున్నట్లు సమాచారం. శోభా మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కనున్న ఈ పాట చిత్రీకరణ మరో రెండు రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. ‘విశ్వంభర’ మూవీ ఇంటర్వెల్ బ్యాగ్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ సీన్ సినిమాకు హైలైట్​గా ఉండనుందని తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చిత్రబృందం.. దాదాపు 25 రోజుల పాటు ఆ భారీ విగ్రహం ముందు ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి, అషిక రంగనాథ్‌, ఇషా చావ్లా, సురభి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ మే 9న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగా స్టార్ సూపర్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న విడుదల అయ్యి భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సెంటిమెంట్‌తో అదే తేదీన విశ్వంభర చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించినట్లు సమాచారం.