నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 7 న విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తో ఈ సినిమా గ్రాఫ్ ని పైకి లేపాడు. నాగ చైతన్య, సాయి పల్లవి బాగా నటించినా ఈ సినిమాకు సంగీతం ప్రాణం.
ఇప్పుడు ఈ సినిమా నుండి బుజ్జి తల్లి (ఏమి తప్పు చేశావే) పాటను విడుదల చేశారు. ఈ పాటను శ్రీ మని రాయగా, జావేద్ అలీ ఆలపించారు

