నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు.
మెగాస్టార్ స్పీచ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వక్ సేన్ ను అభినందించారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి ని ఆహ్వానించడంపై, లైలా ప్రెస్ మీట్ లో ఒక సినీ జర్నలిస్ట్ నందమూరి కాంపౌండ్ నుండి మెగా కాంపౌండ్ కు వచ్చారా అన్న ప్రశ్నకు హీరో విశ్వక్ సేన్ జవాబిస్తూ ఆ కాంపౌండ్, ఈ కాంపౌండ్ అనేవి లేవు. ఇక్కడ ఉన్నది ఒకటే సినీ కాంపౌండ్ అని సమాధానం చెప్పారు హీరో విశ్వక్ సేన్. ఈ విషయంలో మెగా స్టార్ చిరంజీవి, విశ్వక్ సేన్ ను అభినందించారు.
గతంలో విశ్వక్ సేన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.
ఆ తర్వాత మెగా స్టార్ చిరంజీవి కూడా విశ్వక్ సేన్ చెప్పినట్లు ఇక్కడ ఉన్నది సినీ కాంపౌండ్ మాత్రమే అని మరో సారి చెప్తూ సినీ జర్నలిస్టులకు చురకలు అంటించారు.
ఆయినా, ఇలాంటి ప్రశ్నలు వేసేటప్పుడు, జర్నలిస్ట్ లు ఒకసారి ఆలోచించాలి. మీకేదో సంచలన వార్త కావాలి అని ఇండస్ట్రీలో అగ్గి రాజేసే ప్రశ్నలు వేయకూడదు. ఒక్కొక్క సారి, సినీ జర్నలిస్ట్ లు అడిగే ప్రశ్నలు వివాదాలకు దారి తీస్తాయి. హీరోలు బాగానే ఉంటారు. దీనివలన హీరోల అభిమానుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ విషయాన్నే మెగాస్టార్ చిరంజీవి చెప్పారు

