హాలీవుడ్ లో ఎంతో పేరున్న ప్రముఖ సంస్థ డిస్నీ. ముఖ్యం గా చిన్న పిల్లలకు సంబంధించిన రకరకాల క్యారెక్టర్ లను సృష్టించిన సంస్థ. ఈ డిస్నీ సంస్థ తెరకెక్కించిన చిత్రం ముఫాసా – ది లయన్ కింగ్ గతేడాది విడుదలై పిల్లలని, పెద్దలని అందరిని ఆకట్టుని సినిమా సూపర్ హిట్ అయ్యింది
ఒక రాజ్యం లో సింహాసనమ్ కోసం వేసే ఎత్తులకు పైఎత్తులు ఇలాంటివన్నీ రెగ్యులర్ సినిమాలలో చూసేవి. అయితే ఇలాంటి కథతో అడవి కి రాజు అయిన సింహాలతో తీస్తే ఎలా ఉంటుందంటే అది ముఫసా : ది లయన్ కింగ్. ఈ సినిమాకు తెలుగు లో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు
ఈ సినిమా ఇప్పుడు ఓ టి టి లో కి రాబోతోంది. డిస్నీ కి సంబంధించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల అంటే ఫిబ్రవరి 18 నుండి స్ట్రీమింగ్ అవబోతోంది అని మేకర్స్ ప్రకటించారు. పరీక్షల సమయంలో వస్తోంది. పిల్లలు అందరు ఎగ్జామ్స్ బాగా రాసి ఆ తర్వాత ఈ సినిమాను ఇంట్లో ఎంజాయ్ చేయండి

