అవడానికి 100 సంవత్సరాల చరిత్ర గల జాతీయ పార్టీ, అయినా గత మూడు సార్లు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరువలేకపోయింది. మూడు సార్లు ఎన్నికల్లో అంటే 15 సంవత్సరాలలో కాంగ్రెస్ ఒక సీట్ గెలుచుకోలేదన్నమాట. అయితే ఇన్ని సంవత్సరాలలో నేర్చుకున్న పాఠాలు ఏమిటి. ఒంటరిగా గెలిచే శక్తి లేని జాతీయ పార్టీ వేరే పార్టీ తో పొట్టుకోవచ్చు కాదా. కాంగ్రెస్ ఎలాగూ గెలవడం కానీ బీజేపీ వ్యతిరేక ఓట్లను ఆప్ చీల్చడం ద్వారా ఆప్ అవకాశాలకు గండి కొట్టింది
కాంగ్రెస్ కు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం ఓట్ షేర్ పెరిగింది. భారతీయ జనతా పార్టీ వోట్ షేర్ 45.5%. ఆప్ వోట్ షేర్ 43.5%. వీరిద్దరి మధ్య ఓట్ షేర్ తేడా కావాలా 2%. కాంగ్రెస్ ఓట్ షేర్ 6.3%. కాంగ్రెస్, ఆప్ లకు కలిపి వచ్చిన ఓట్ షేర్ సుమారు 50%. కాంగ్రెస్ ఓడిపోవడం కాదు ఆప్ కొంప ముంచింది
అయితే ఆప్ 22 సీట్లకే పరిమితమైన, 43% వోట్ షేర్ అంటే అది సామాన్య విషయం కాదు. కాకపోతే ఆప్ కీలక నేతలు ముఖ్యంగా కేజ్రీవాల్, సిసోడియా లు ఓడిపోవడం ఆప్ కు పెద్ద దెబ్బ. ఒకసారి బీజేపీ అధికారం లో కి వస్తే దాని దింపడం కష్టం. అందులోను, ప్రతి పార్టీ కి మూడు సార్లు అవకాశమిచ్చే ప్రజలున్న ఢిల్లీ రాష్ట్రంలో
ఆప్ ఓడి పోయినచోట, ఆ ఓటమి తేడా ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి కి వచ్చిన ఓట్లకు దగ్గరగా ఉన్నాయి
జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇంత ఘోర పరాభవాన్ని ఎలా తీసుకుంటుంది. ఈ పరాభవం కాంగ్రెస్ కు ఇప్పుడు అలవాటైపోయింది

