ఢిల్లీ లో జాతీయ పార్టీ ఆయిన కాంగ్రెస్ సరి కొత్త రికార్డు సృష్టించింది. ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
వంద సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వరసగా మూడు అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీట్ కూడా గెలుచుకోకుండా సరికొత్త రికార్డు సృష్టించింది
గతం లో కాంగ్రెస్ పార్టీ 1998 నుండి 2013 వరకు, 15 సంవత్సరాలు ఢిల్లీ ని పాలించింది. అప్పటి కాంగ్రెస్ తరపు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్. ఢిల్లీ లో వరసగా 15 సంవత్సరాలు పాలించడం ఒక రికార్డు. అప్పట్లో భారత దేశంలో, ఒక రాష్ట్రాన్ని వరసగా 15 సంవత్సరాలు పరిపాలించిన మహిళా ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ రికార్డు సృష్టించారు
అయితే అంత ఘనమైన రికార్డు ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పుడు ఒక చెత్త రికార్డు ను మూట కట్టుంకుంది. అదేంటంటే 2015, 2020, 2025 లలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలుచుకోలేదు
2015 ఎన్నికలలో కాంగ్రెస్ ఓట్ షేర్ 9.7%, 2020 లో 4.2% ఇప్పుడు 2025 లో సుమారు 6% కానీ గెలుచుకున్న సీట్లు ‘ 0 ‘

