అభిమానుల చూపించే ప్రేమకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటానని ఎన్టీఆర్ అన్నారు. అభిమానుల తాకిడి దృష్ట్యా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసుకున్న ఎన్టీఆర్ ఆ తరవాత అభిమానులను కలుసుకోలేకపోయాడు. అభిమానుల ఆతృతను దృష్టి లో పెట్టుకుని పర్సనల్ గా అభిమానులను కలవాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడు
భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోన్న ఈ ఫ్యాన్ మీట్ కు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, పోలీస్ వారి అనుమతి తీసుకోవడమే కాకుండా, చట్ట మరియు న్యాయపరమైన ఇతర అనుమతులు అన్ని తీసుకుని అప్పుడు కలవడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తారక్ చెప్పారు. కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది కాబట్టి, అభిమానులందరూ సహనంతో ఉండాలని ఎన్టీఆర్ కోరారు
తనను కలుసుకోవడానికి ఎవరు పాద యాత్రలు లాంటివి చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అభిమానుల అభిమానమే నా ప్రపంచం అని తారక్ చెప్పారు అయితే అన్నిటి కన్నా ముందు అభిమానుల ఆరోగ్యం, వారి యోగ క్షేమాలే నాకు ముఖ్యం అని ఎన్టీఆర్ అన్నారు.
ఇంత భారీస్థాయిలో ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు అంటే దీనికి వెనక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా కేవలం ఫ్యాన్ మీట్ కార్యక్రమమేనా అన్న విషయం తెలియాలి

