నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో బిజీ గా ఉన్నారు. చేతిలో ఒక అరడజను సినిమాలు ఉన్నాయి. యశ్ హీరో గా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ఉప శీర్షిక. కె వి ఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ సినిమాకి గీతు మోహన్ దాస్ దర్శకురాలు. కియారా అద్వానీ కధానాయిక
ప్రస్తుతం బెంగుళూరు లో ప్రారంభమైన షెడ్యూల్ తోనే నయనతార సెట్ లోకి అడుగు పెడుతున్నారు. ఇదే షెడ్యూల్ తో హ్యూమా ఖురేషి, తార సుతారియా లు కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోందని సమాచారం
కెజిఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో దేశవ్యాప్తం గా క్రేజ్ సంపాదించుకున్న హీరో యశ్. కెజిఫ్ తర్వాత వస్తోన్న యాష్ సినిమా కావడంతో అంచనాలు భారీగా వున్నాయి

