రామ్ చరణ్, కియారా అద్వానీ జంట గా నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై, దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. శంకర్ తెలుగు లో తీసిన మొదటి సినిమా.
ఫుల్ రన్ లో గేమ్ చేంజర్ సుమారు 130 కోట్ల షేర్ ని సాధించింది. నెగటివ్ టాక్ తో, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల మధ్య పోటీ లో ఈ వసూళ్లు అద్భుతమని చెప్పాలి
ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 7 నుండి అమెజాన్ లో స్ట్రీమ్ కాబోతోంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇంకా హిందీ, మలయాళం భాషల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
థియేటర్ లో మిస్ అయిన వారు అమెజాన్ లో చూసేయండి

