నెట్ ఫ్లిక్ లో ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ అనే కొత్త షో రాబోతోంది. దీనిలో అందరు బాలీవుడ్ కపూర్ ఫామిలీ కి చెందిన వాళ్ళే ఉంటారు. అందుకే షో టైటిల్ ను ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ అని పెట్టారు
ఈ షో లో కపూర్ ఫామిలీ కి చెందిన అక్క చెల్లెల్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ లు ఉన్నారు. ఇంకా వెటరన్ నటి నీతూ కపూర్, ఆమె కూతురు రిద్ధిమా కపూర్ సైతం ఉన్నారు. ఇంకా రణధీర్ కపూర్, రణబీర్ కపూర్, అర్మాన్ జైన్ ఆధార్ జైన్, రీమా జైన్ కూడా ఇందులో పాల్గొంటారు
నెట్ ఫ్లిక్ 2025 లో రాబోయే షోలు, సినిమాలు, సిరీస్ ల ఆ వివరాలను పోస్ట్ చేసింది. ఈ లిస్ట్ లో ఈ ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ కూడా ఉంది. అతి త్వరలో నెట్ ఫ్లిక్ లో రాబోతున్న ఈ షో ఎలాంటి అనుభూతులను పంచుతుందో, ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి
ముందు ముందు, ఈ షో లో సైఫ్ అలీ ఖాన్, అలియా భట్ లు కూడా కనిపిస్తారట
ఎక్స్ లో ఈ షో గురించి నెట్ ఫ్లిక్ చేసిన పోస్ట్ షేర్ చేస్తున్నాం మీకోసం.

