మాస్ కా దాస్ విశ్వక్ సేన కొత్త సినిమా ‘లైలా’ సినిమా ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెట్ అప్ లో కనిపించనున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాఖి’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. విశ్వక్ సేన్ ఆశలన్నీ ‘లైలా’ మీదనే ఉన్నాయి
ఇప్పుడు ‘లైలా’ ట్రైలర్ ను ఈ నెల ఆరున, అంటే ఎల్లుండి విడుదల చేయన్నునారు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 14 న విడుదలవుతోంది
రామ్ నారాయణ్ దర్శకత్వంలో వాతోన్న లైలా కి లియోన్ జేమ్స్ సంగీతానందిస్తున్నారు. లైలా సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు
ట్రైలర్ ను విడుదల చేసే పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్ విశ్వక్ సేన్ హీరో పాత్రలో, లేడీ గెట్ అప్ లో కనిపిస్తున్నారు
అమ్మ తోడు అడ్డ దిడ్డంగా నవ్విపిస్తా అని విశ్వక్ సేన్ ఎక్స్ లో రాసుకొచ్చాడు

