కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీహార్ కు పెద్ద పీట వేశారు అని అందరూ అంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
మొదటిది, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెడ్డి (జేడీయూ పార్టీ) తో కలిసి భాజపా బీహార్ లో అధికారం లో ఉంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో జేడీయూ కీలక భాగస్వామి. మన టీడీపీ కూడా కీలక భాగస్వామియే అనుకోండి. అది కాకుండా మరో సంవత్సరంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అంతే కాకుండా, నితీష్ కుమార్ రెడ్డి గోడ మీద పిల్లి లాంటి వాడు. ఎప్పుడు ఎటు వైపు వెళతాడా తెలీదు. ఈ సారి భాజపా ని వీడే ప్రసక్తి లేదని ఈ మధ్య చాల సార్లు తెగేసి చెప్పాడు. అయినా, నితీష్ కుమార్ రెడ్డి ని చేయి దాటి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీజేపీ పై ఉంది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని మరి బడ్జెట్ రూపకల్పన చేశారు మన ఆర్ధిక మంత్రి
అసలు బీహార్ కు ఏం ఇచ్చారో చూద్దాం
- రైతుల కోసం ప్రత్యేకంగా 100 కోట్లతో ‘మఖానా బోర్డు’ ఏర్పాటు చేస్తున్నారు.
- పాట్నా విమానాశ్రయాన్ని కెపాసిటీ పెంచి అభివృద్ధి చేయడం కాకుండా, బిహాట వద్ద బ్రౌన్ ఫీల్డ్ విమనాశ్రాయాన్ని అభివృద్ధి చేయడం
- బీహార్ లోని, మిధిలాంచల్ లో వెస్ట్రన్ కోషి కెనాల్ ప్రాజెక్ట్ కు కేంద్ర ఆర్ధిక సాయం. ఈ ప్రాజెక్ట్ వలన, ఈ ప్రాంతంలో 50 వేల హెక్టార్లకు పైగా భూమి సాగు చేసే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది
- వచ్చే పదేళ్లలో ఎక్కువ మందికి విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్యంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం
అయితే ఆంధ్ర ప్రదేశ్ కు చెప్పినట్లుగా, ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని గతంలోనే తేల్చి చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ తరవాత అరవై వేల కోట్ల ఆర్ధిక సహాయం కూడా అందించింది.
అయితే అందరు అనుకుంటున్నట్లుగా భారీ వారాలు ఏమి ఇవ్వలేదు అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతుల కోసం ముఖాన బోర్డు ఏర్పాటు చేయడం మాత్రమే కీలకమైన వరం
అయితే ఇప్పటికే ఆర్ జే డి నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అయినా తేజస్వి యాదవ్ ‘పాత పధకాలను కొత్త పొట్లంలో’ చుట్టి ఇచ్చారని విమర్శించారు.

