అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో, భారత జట్టు, దక్షిణ ఆఫ్రికా పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
83 పరుగుల లక్ష్య ఛేదనలో, ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న, ఓపెనర్ కమలిని 8 పరుగుల వద్ద అవుట్ అయ్యింది
మరో ఓపెనర్, తెలుగు అమ్మాయి గొంగడి త్రిష తన ఫామ్ ని కొనసాగిస్తూ కేవలం 33 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వన్ డౌన్ లో వచ్చిన సనిక 22 బంతుల్లో 26 పరుగులు చేసి అజేయం గా నిలిచింది
అంతకు ముందు, టాస్ గెలిచిన దక్షిణ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణ ఆఫ్రికా 82 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
భారత బౌలర్లలో మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష మూడు వికెట్లు తీయగా, వైష్ణవి శర్మ, పరునిక సిసోడియా, ఆయుషి శుక్ల చెరో రెండేసి వికెట్లు తీశారు. షబ్నమ్ షకీల్ ఒక వికెట్ తీసింది
దక్షిణ ఆఫ్రికా ప్లేయర్ లలో నలుగురు ఆటగాళ్లు డక్ అవుట్ అయ్యారు. మరో నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. వాన్ ఊర్స్ట్ 23 పరుగులతో దక్షిణ ఆఫ్రికా టాప్ స్కోరర్ గా నిలిచింది
తెలుగు అమ్మాయి గొంగడి త్రిష టోర్నమెంట్ లో ఎక్కువ పరుగులు (309) సాధించిన క్రికెటర్ గా నిలిచింది. మన దేశానికి చెందిన వైష్ణవి శర్మ ఎక్కువ వికెట్లు (17 వికెట్లు) తీసిన బౌలర్ గా నిలిచింది వైష్ణవి శర్మకు, గొంగడి త్రిషకు అభినందనలుది.

