కౌలాలంపూర్ లో జరుగుతోన్న, అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో టాస్ గెలిచిన దక్షిణ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణ ఆఫ్రికా 82 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
భారత బౌలర్లలో మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష మూడు వికెట్లు తీయగా, వైష్ణవి శర్మ, పరునిక సిసోడియా, ఆయుషి శుక్ల చెరో రెండేసి వికెట్లు తీశారు. షబ్నమ్ షకీల్ ఒక వికెట్ తీసింది
దక్షిణ ఆఫ్రికా ప్లేయర్ లలో నలుగురు ఆటగాళ్లు డక్ అవుట్ అయ్యారు. మరో నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. వాన్ ఊర్స్ట్ 23 పరుగులతో దక్షిణ ఆఫ్రికా టాప్ స్కోరర్ గా నిలిచింది
ఈ అండర్ 19 వరల్డ్ కప్ లో భారత బౌలర్ వైష్ణవి శర్మ 17 వికెట్ల తో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచింది

