సీనియర్ హీరోల దర్శకుడు మరో కొత్త సినిమాతో

by | Feb 2, 2025 | సినిమా

బాబీ వరసగా సీనియర్ హీరోలతోనే సినిమాలు తీసున్నాడు.

2019 లో విక్టరీ వెంకటేష్ తో వెంకీ మామ తీసిన దర్శకుడు బాబీ 2023 లో మెగా స్టార్ చిరంజీవి తో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.  ఆ తర్వాత 2025 లో మరో సీనియర్ హీరో బాల కృష్ణ తో ‘డాకు మహారాజ్’ తీశాడు. 

ప్రస్తుతం చిరంజీవి నడిచిన ఫాంటసీ చిత్రం విశ్వంభర మే లో విడుదల కు సిద్ధం గా ఉంది.  దీని తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా,  రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతి కి వస్తున్నాం చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నారు. ఇవి రెండు ఇంకా పట్టాలెక్కకముందే, బాబీ తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు

ఇప్పుడు మళ్ళి మెగా స్టార్ చిరజీవి కోసం బాబీ మరో సరి కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట.  మన మెగా స్టార్ చిరంజీవి.  ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారని తెలుస్తోంది.  అయితే బాబీ లేదా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా మీద  అనౌన్స్ మెంట్ చేయాలి