”బడ్జెట్ కాదు కధే ముఖ్యం’ అని సంక్రాంతికి వస్తున్నాం చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ మీట్ లో దిల్ రాజు అన్నారు. కానీ కొన్ని విషయాలు మర్చిపోతుంటాం (‘బడ్జెట్ కాదు కధే ముఖ్యం అనే విషయం) అని దిల్ రాజు చెప్పారు
సంక్రాంతి కి వస్తున్నాం సూపర్ హిట్ అవడం తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాం అంటున్నాడు దిల్ రాజు. అసలు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కధ ఎక్కడుంది
సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ కావడానికి కారణాలు ఏంటో చూద్దాం
గేమ్ చేంజర్ సినిమా కంటెంట్ పొలిటికల్ సబ్జెక్టు, ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ చాలా వీక్ గా డిజైన్ చేశాడు శంకర్. నెగటివ్ టాక్ రావడంతో, ఫామిలీ ఆడియన్స్ చూడడానికి ముందుకు రాలేదు (సంక్రాంతి పండకకు ఫామిలీ ఆడియన్స్ వచ్చే సినిమా కాదు)
డాకు మహారాజ్ – ఇప్పటి బాల కృష్ణ సినిమాలు ఫామిలీ ఆడియన్స్ కు ఎప్పుడు మెయిన్ ఛాయస్ కాదు.
ఇక ఈ రెండు సినిమాలు కాకుండా మిగిలిన ఏకైక సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ – సినిమా టైటిల్ తోనే ఫామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం, వినూత్నమైన అనిల్ రావిపూడి ప్రొమోషన్స్, ఫామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కి ఉన్న క్రేజ్, అనిల్ రావిపూడి కామెడీ బ్రాండ్ ఇమేజ్ వంటి అంశాలన్నీ ఈ సినిమాకు పని చేశాయి. అంతే కాకుండా, భీమవరం బుల్లి రాజు (వెంకటేష్ కొడుకు పాత్ర) మేజిక్ పని చేసింది. భీమ్స్ సంగీతం, రమణ గోగుల చాల రోజుల తర్వాత పాడటం, రిలీజ్ టైమింగ్ అంటే పండగకు పర్ఫెక్ట్ సినిమా వంటి అంశాలు కలిసి వచ్చాయి
‘బడ్జెట్ కాదు కధే ముఖ్యం’ అనే పాయింట్ కు వస్తే, అసలు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కధ ఎక్కడుంది. ఇదంతా కిచిడి కామెడీ. అనిల్ రావిపూడి భారీతనం కధలో కన్నా కామెడీ లో ఉంటుంది, కాబట్టి ఇలాంటి సినిమాలకు బడ్జెట్ అవసరం లేదు
ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న దిల్ రాజు, జీ స్టూడియో తో ఎందుకు వెళ్ళాడు, మైండ్ లెస్ గా పాటలకు 75 కోట్లు ఖర్చు ఎందుకు పెట్టాడు, శంకర్ కి చెప్పలేకపోయాడా? శంకర్ ఏమో 5 గంటల కంటెంట్ ఉంది అంటున్నాడు మరి ఆ కంటెంట్ ఏమైంది. ఏం జరిగింది దిల్ రాజు గారు. ఏది ఏమైనా రామ్ చరణ్ కి మీరు ఒక ప్లాప్ ఇచ్చారు. రామ్ చరణ్ అభిమానులు మిమ్మల్ని మరచిపోరు
గేమ్ చేంజర్ కధ, అన్ని సంవత్సరాలు తీయవలసిన సినిమా కాదు అది. శంకర్ భారతీయుడు 2, గేమ్ చేంజర్ సినిమాలు రెండు ఒకే సారి చేస్తే మీరు చెప్పలేకపోయారా. బేసిక్ గా శంకర్ ని, జీ స్టూడియో ని దిల్ రాజు హేండిల్ చేయలేక పోయారని అర్ధం అవుతోంది.
బడ్జెట్ కాదు కధే ముఖ్యం ఇది దిల్ రాజు వెర్షన్. అయితే మిగతా వెర్షన్ లు చూద్దాం
- కధకు తగ్గ బడ్జెట్ ఉండాలి
- ఎంతటి బడ్జెట్ నైనా హేండిల్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి
- ఎవరితో సినిమాలు తీయాలి, ఎలాంటి సినిమాలు తీయాలి అన్న జడ్జిట్మెంట్ స్కిల్స్ఉండాలి.
ఈ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ వారు అనుభవం (దిల్ రాజు కు ఉన్నంత) లేకపోయినా, దూసుకు పోతున్నారు.
దిల్ రాజు ఎప్పటి లాగే చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తేనే బావుంటుంది. ఎవరితోనే కంపేర్ చేసుకుని భారీ స్థాయి చిత్రాలు చేద్దామనుకుంటే ఇలానే ఉంటుంది
చిన్న సినిమాలను హేండిల్ చేయడం వేరు. పెద్ద బడ్జెట్ సినిమాలు, కార్పొరేట్ కంపెనీలను, పెద్ద డైరెక్టర్లను (అందులో శంకర్ లాంటి డైరెక్టర్స్ ని) హేండిల్ చేయడం వేరు.
ఏమైనా సంక్రాంతి కి వస్తున్నాం సినిమా ఎలాంటి సినిమాలు చేయాలో పాఠాలు నేర్పితే, గేమ్ చేంజర్ సినిమా ఎలాంటి సినిమాలు చేయకూడదో నేర్పింది

